ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు నితిన్. తాజాగా మరో సినిమాను అంగీకరించారాయన. నితిన్ కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ 'పవర్ పేట' పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించనున్నది. కృష్ణచైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 2020 వేసవిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానున్నది. ఆసక్తికర కథ, కథనాలతో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాల్ని త్వరలో వెల్లడించనున్నట్లు చిత్రబృందం పేర్కొన్నది. ప్రస్తుతం నితిన్..వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ', చంద్రశేఖర్ యేలేటి 'చదరంగం', వెంకీ అట్లూరి 'రంగ్ దే' సినిమాల్లో నటిస్తున్నారు. అవి పూర్తయిన తర్వాత 'పవర్‌పేట' షూటింగ్‌లో నితిన్ పాల్గొననున్నారు.
నితిన్ ‘పవర్ పేట’